Pakistan Rejects China's Offer of Diamer-Bhasha Dam in PoK

  • 6 years ago
Pakistan has turned down China's offer of assistance for the $14-billion Diamer-Bhasha Dam, The project is located in Pakistan Occupied Kashmir (PoK), which is claimed by India.

మిత్ర దేశం చైనాకు పాకిస్తాన్ దిమ్మతిరిగే షాకిచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో నిర్మించనున్న డ్యాంకు నో చెప్పింది. చైనా - పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో చైనా ఆఫర్‌ను పాక్ తిరస్కరించింది. పీవోకేలో డైమర్ భాషా డ్యాం నిర్మాణానికి 14 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు చైనా ముందుకు రాగా, పాక్ నిరాకరించడం గమనార్హం.
60 బిలియన్లతో చేపడుతున్న సీపీఈసీ నుంచి ఈ ప్రాజెక్టును తప్పించాలని, ఈ డ్యాంను తామే కట్టుకుంటామని పాకిస్తాన్ నేరుగా చైనాకు చెప్పిందని తెలుస్తోంది. భారత్ తన ప్రాంతంగా పేర్కొంటున్న పీవోకేలో ఈ డ్యాం నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు నిరాకరించింది.
ఈ వివాదాస్పద ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా నిరాకరించాయి. ఈ నేపథ్యంలో సీపీఈసీలో ఈ డ్యాంకు రుణం ఇచ్చేందుకు చైనా కంపెనీలు ముందుకు వచ్చాయి.