Indian Cricketers Undergoing DNA Test

  • 6 years ago
Keeping in sync with skipper Virat Kohli's uncompromising training regimen, the Indian cricketers are now undergoing DNA test that reveals the genetic fitness blueprint of an individual, raising the bar to a level hitherto unseen.

భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా, క్రికెటర్లు డీఎన్‌ఏ పరీక్షకు హాజరవుతున్నారు. ఫిట్‌నెస్‌ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని నిర్ణయించుకున్న బోర్డు, ఇందులో భాగంగా భారత ఆటగాళ్లందరికీ డీఎన్‌ఏ టెస్టులు నిర్వహిస్తోంది. ఈ డీఎన్ఏ టెస్టుతో ప్రతి క్రికెటర్ జన్యు సంబంధ ఫిట్‌నెస్‌ వివరాలు తెలుస్తాయి. ఓ ఆటగాడు తన వేగాన్ని, కండలను పెంచుకోవడానికి.. కొవ్వును కరిగించుకోవడంతో పాటు... కోలుకునే సమయం గురించి మరింత స్పష్టత వచ్చేందుకు ఈ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం భారత జట్టులో సభ్యుడైన ఆటగాడి శరీరంలో 23 శాతానికి మించి కొవ్వు ఉండరాదు. జనెటిక్‌ ఫిట్‌నెస్‌ టెస్టుగా కూడా పిలుచుకునే ఈ పరీక్షతో క్రికెట్ శరీరానికి సంబంధించి 40 రకాల జీన్స్‌ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. జట్టు ట్రైనర్‌ శంకర్‌ బసు సూచన మేరకు బీసీసీఐ ఈ కొత్త పరీక్షను ప్రవేశపెట్టింది. దీనిని నిర్ధారించిన బీసీసీఐ అధికారి ఒకరు ఈ పరీక్ష కోసం ఒక్కో ఆటగాడికి గరిష్టంగా రూ.30 వేలు అవసరమవుతుందని, అది పెద్ద మొత్తమేమీ కాదని చెప్పారు. ఎన్‌బీఏ, ఎన్‌ఎఫ్‌ఎల్‌లలో కూడా డీఎన్‌ఏ టెస్టు అమల్లో ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Recommended