Adirnidhi First Day Collections దుమ్ము రేపుతున్న అదిరింది

  • 7 years ago
Adirnidhi (Mersal in Tamil) movie released on Novemebr 9th. Despite mixed feedback to the content, Adirindhi has taken a huge opening at the box-office. It’s undoubtedly the biggest opener for Vijay in Telugu.

తమిళంలో అనేక వివాదాలకు వేదిక మారిన మెర్సల్ చిత్రం అదిరింది పేరుతో తెలుగులో నవంబర్ 9న రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించడం విశేషం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నట్టు ట్రేడ్ వర్గాల విశ్లేషణ.
మెర్సల్ రిలీజైన తర్వాత మూడు వారాలకు అదిరింది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన కనిపించినప్పటికీ.. వసూళ్ల పరంగా మంచి స్పందన వచ్చినట్టు తెలుస్తున్నది. వీకెండ్‌లో మంచి కలెక్షన్లను సాధించడానికి అవకాశం ఉంది అనే మాట ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నది.
తొలిరోజున అదిరింది చిత్రం 10 కోట్ల వసూలు చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. వారాంతంలో ఇంకా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. తొలివారాంతం తర్వాత ఇదే విధంగా వసూళ్లు ఉంటే తెలుగులో కూడా సినిమా ఘనవిజయం సాధించడానికి ఛాన్స్ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తమిళంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్ల వసూలు చేసింది. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా పేరు తెచ్చుకొన్నది.

Recommended