GST at 5% Only In All Restaurants | Oneindia Telugu
  • 6 years ago
Union Finance Minister Arun Jaitley said that all restaurants in the country will now be levied GST of 5%, adding that there will be no ITC benefit to any restaurant. While addressing the media after 23rd GST Council Meet in Guwahati, Jaitley said that about 178 items have been moved from 28 percent to 18 percent GST slab.

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లపై వినియోగదారులకు భారీ ఊరట నిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని హోటల్స్‌పై (స్టార్‌ హోటల్స్‌తప్ప) జీఎస్‌టీ రేటును 5శాతంగా నిర్ణయించింది. శుక్రవారం గౌహతిలో జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ జీఎస్‌టీ స్లాబ్‌ రేట్ల వివరాలను మీడియాకు వివరించారు.228 వస్తువుల్లో దాదాపు 178 వస్తువులకు 28శాతం జీఎస్‌టీ నుంచి మినహాయింపు(18శాతానికి) నిచ్చామనీ, 6 అంశాలను 5శాతంనుంచి జీరో శాతానికి తెచ్చామని చెప్పారు. అలాగే జీఎస్‌టీ భారాన్ని హోటల్స్‌పై భారీగా తగ్గించినట్టు అరుణ్ జైట్లీ తెలిపారు.హోటల్స్‌, రెస్టారెంట్లపై జీఎస్‌టీ కౌన్సిల్‌లో విస్తృత చర్చ జరిగిందని ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. ఇప్పటివరకు 18శాతం ఉండగా, ఇపుడు 5శాతంగా నిర్ణయించామన్నారు. టర్నోవర్‌, ఏసీ, నాన్‌ఏసీతో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై జీఎస్‌టీ రేటు 5శాతంగా ఉంటుందని తెలిపారు.ఈ క్రమంలో ఏసీ, నాన్‌ ఏసీ తేడా లేకుండా, అలాగే టర్నోవర్‌తో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై 5శాతం టాక్స్‌(విత్ అవుట్ ఐటీసీ)ను వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ. 7,500 రూము రెంట్‌ వసూలు చేసే స్టార్‌హోటల్స్‌పై 18శాతం జీఎస్‌టీ (ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌తో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. ఔట్‌ డోర్‌ కేటరింగ్‌పై 18శాతం (విత్‌ ఐటీసీ)గా ఉంటుంది.
Recommended