Actress Namitha Announced Her Marrige Date పెళ్ళి డేట్ చెప్పేసింది

  • 7 years ago
Namitha has a good news for her fans. The actress has announced to marry Veerandra Chowdhary and also revealed the wedding date. The big news was revealed on her Instagram account through a video where Riaz Wilson, model and Bigg Boss Tamil contestant, announced that they are happy to announce the date of the big day.

తమిళ నటుడు వీరా (వీరేంద్ర చౌదరీ) తో ఈనెల 24న తన వివాహం జరగనుందని నమిత స్వయంగా చెప్పింది. తమిళ బిగ్ బాస్ ప్రోగ్రాం కంటెస్టెంట్లు రజియా విల్సన్ మరికొందరు కలిసి సోషల్ మీడియాలో ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నామంటూ వీడియో మెసేజ్ ద్వారా అభిమానులందరికీ నమిత పెళ్లి సంగతి తెలియజేశారు.
అదే వీడియోలో తన బాయ్ ఫ్రెండ్.. ఉడ్ బీతో కలిసి కనిపించిన నమిత తన సొట్టబుగ్గల నవ్వులతో ఆనందంగా మాట్లాడింది. నవంబర్ 24న వీరాతో తన పెళ్లి జరగనుందని.. మీ అందరి ప్రేమాభిమానాలు తనకెప్పుడూ ఉండాలని కోరుకుంది. నమిత పెళ్లి చేసుకోబోతున్న వీరా తమిళంలో చిన్నాచితకా పాత్రలు చేస్తుంటాడు. వీళ్లిద్దరూ కలిసి మియా అనే థ్రిల్లర్ ఫిలింలో నటించారు.
నమిత పరిచయమైంది.. పేరు తెచ్చుకుంది తెలుగు తెరపైనే అయినా ఇక్కడ ఆమెకు చెప్పుకోదగిన అవకాశాలు ఒకట్రెండు మాత్రమే వచ్చాయి. భారీ అందాలకు పెద్దపీట వేసే కోలీవుడ్ వెల్ కం చెప్పడంతో పెట్టెబేడా సర్దుకుని చెన్నైకి షిఫ్టయిపోయింది. చివరకు తమిళనాడులోనే తన లైఫ్ పార్టనర్ ను వెతుక్కుని అక్కడే సెటిలయిపోతోంది.
ఒకప్పుడు నమితకు తమిళంలో స్టార్ హీరోస్ కి ఉన్న క్రేజ్ ఉండేది. ఈమె సినిమాల కోసం అభిమానులు థియేటర్ల దగ్గర బారులు కట్టేవారు. కొంద‌రు త‌న అభిమానం చాటుకోవ‌డానికి గుళ్ళు కూడా క‌ట్టారు. తెలుగులోను సత్తా చాటిన నమిత చివరిగా 2010లో విడుదలైన సింహలో నటించింది.

Recommended