Rashmi Gautam Emotional In A Television Talk Show కంటతడి పెట్టిన రష్మి
  • 6 years ago
Actor, Anchor Rashmi Gautam emotional in a television talk show. She explained her problem during the initial days of the Industry. Rashmi remembered her diffuculties faced in careers early days. She emotionally burusted and her eye gets full of tears.

యాంకర్‌గా, సినీ తారగా రష్మీ గౌతమ్ అందరికీ తెలుసు. జబర్దస్త్ టీవీ షోలో యాంకర్‌గా కంటే సుధీర్‌తో అఫైర్ అనే వార్తతోనే సోషల్ మీడియాలో ఫేమస్. ప్రస్తుతం టాప్ యాంకర్లలో రష్మీ ఒకరు. అలాంటి పేరు ఉన్న రష్మీ ఇటీవల ఆలీ నిర్వహించిన టాక్‌షోలో సందడి చేసింది. డబ్బులు బాగా ఇస్తానంటే చిన్న హీరోతోనైనా నటించడానికి సిద్ధమని ఆమె చెప్తూ డబ్బుకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించింది. డబ్బుల లేకుండా ఎన్ని కష్టాలు పడ్డానో అంటూ కంటతడి పెట్టింది.
రోజకు 100కు 110 మార్కులు, అనసూయ 99 మార్కులు, శ్రీముఖికి 98, యాంకర్‌గా నాకు నేను 100 మార్కులు వేసుకొంటాను. అనసూయ నాకు చాలా ఇన్‌స్పిరేషన్. ప్రసవం తర్వాత పదిరోజుల్లోపే మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. ప్రొఫెషనంటే ఆమెకు చాలా గౌరవం.
రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తే చిన్న హీరో పక్కన నటించడానికి సిద్ధం. క్రియేటివిటీ విషయంలోనన్నా.. లేదా బ్యాంక్ బ్యాలెన్స్‌ విషయంలోనైనా సంతృప్తి ఉండాలి. లేకపోతే పనిచేయడంలో అర్థం ఉండదు.
జీవితంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యం గురించి అనుభవ పూర్వకంగా నేర్చుకొన్నాను. వైజాగ్ నుంచి ఒంటరిగా హైదరాబాద్ వచ్చాను. చాలా బాధలు పడ్డాను. నా ఫస్ట్ రెమ్యునరేషన్ అన్నపూర్ణ స్టూడియో వాళ్లు 25 వేలు ఇచ్చారు. అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ విత్ డ్రా చేశాను.
Recommended