India vs New Zealand 3rd T20: MS Dhoni vs Series | Oneindia Telugu

  • 7 years ago
Even though he scored 49 runs from 37 balls against New Zealand in the second T20 in Rajkot, MS Dhoni was once again the centre of attention as he couldn’t take the side over the winning hurdle to see the hosts fall short by 40 runs. Former India cricketers VVS Laxman and Ajit Agarkar both have called for a change in the shortest format.
భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య చివరిదైన మూడో టీ20కి అంతా సిద్దమైంది. మూడు టీ20ల సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మంగళవారం తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. దీంతో మూడో టీ20లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వన్డే సిరీస్‌ను నెగ్గిన కోహ్లీసేన టీ20 సిరీస్‌నూ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా.. వన్డే సిరీస్‌ను త్రుటిలో చేర్చుకున్న కివీస్‌ కనీసం టీ20 సిరీస్‌ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఢిల్లీ వేదకగా జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన అలవోక విజయం సాధించగా... రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో మాత్రం కోహ్లీసేన పూర్తిగా విఫలమైంది.

Recommended