పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ ఫొటోస్

  • 7 years ago
Pawan Kalyan is presently working on his latest film in the direction of Trivikram Srinivas. More than 80% of the shoot has been completed till now. PK25 shoot is going on in Bulgaria at present.
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌, దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో హారిక‌హాసినీ క్రియేష‌న్స్ బేనర్లో తాజాగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ జరుగుతోంది. బల్గేరియా సెట్స్‌లో షూటింగుకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్, అనూ ఇమ్మానుయేల్ మీద డ్యూయెట్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు.
షూటింగ్ గ్యాపులో బల్గేరియాలోని ఓ షాపులో కాఫీ తాగుతూ సెల్పీ దిగిన త్రివిక్రమ్. పక్కనే పవన్ కళ్యాణ్, హీరోయిన్ అనూ ఇమ్మాన్యూయేల్ ఉన్న ఫోటో..
బల్గేరియాలోని సెట్స్‌లో పవన్ కళ్యాణ్, అను ఇమ్మాన్యూయేల్ మీద పాట చిత్రీకరిస్తున్న ఫోటో..పవన్ అభిమానులని అలరిస్తుంది.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. జనవరి 10న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు. అయితే అభిమానులకు ఆనందం ఇచ్చే విషయం ఏమిటంటే, అజ్ఞాతవాసి జనవరి 9నే విడుదల కానుంది. జనవరి 9న సెకెండ్ షోతో అజ్ఞాతవాసిని విడుదల చేయాలని హారిక హాసిని సంస్థ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Recommended