Skip to playerSkip to main contentSkip to footer
  • 11/6/2017
Telugu Desam Party leader Varla Ramaiah 100 questions to YSR Congress Party chief YS Jaganmohan Reddy before starting Padayatra.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఆయనకు వంద ప్రశ్నలు సంధించారు.
పాదయాత్ర నిర్వహించడానికి ముందు తాను విసిరే వంద శ్నలకు సమాధానం చెప్పాలని వర్ల అన్నారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. వంద ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.వర్ల రామయ్య తన లేఖలో, మీనాన్న ముఖ్యమంత్రి కాక ముందు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మీ కుటుంబం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మి అప్పులు తీర్చుకోవాలని నాటి సీఎం చంద్రబాబుకు మీ నాన్న లేఖ రాసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
అలాంటి మీ కుటుంబం ఈ రోజు దేశంలోనే అత్యధిక ఆదాయ పన్ను చెల్లించే అతికొద్ది కుటుంబాలలో ఒకటిగా ఎలా రూపాంతరం చెందింది? అన్న విషయాలను ప్రజలకు చెప్పాలన్నారు.మీపైన ఉన్న 11 సీబీఐ చార్జీషీట్లలో పేర్కొన్న అవినీతిపై ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలకు వివరించి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలరా? అని జగన్‌కు వర్ల సవాల్ విసిరారు.

Category

🗞
News

Recommended