"లక్ష్మీ పార్వతి దేవత అని ఎవరైనా అంటే సినిమా ఆపేస్తా"

  • 7 years ago
Director Kethireddy Jagadeeswar Reddy said some people Threats me to stop 'Lakshmi's Veeragrantham' film.
మహా నటుడు ఎన్టీఆర్ జీవితాన్ని బేస్ చేసుకుని బాలకృష్ణ ఓ సినిమా, రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' పేరుతో మరో సినిమాను చేయడానికి సిద్ధమయ్యారు. 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' సినిమాను ఆపాలని తనకు బెదిరింపులు వస్తున్నాయని, తాను ఈ సినిమా తీయకుండా లక్ష్మీపార్వతి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. ఎవరి బెదిరింపులకు తాను లొంగను, ఎవరూ నన్ను ఆపలేరు అని తేల్చి చెప్పారు.
‘లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా నవంబర్ 12న మొదలవుతుందని, ఎక్కువ భాగం షూటింగ్ పొన్నూరు, వినుకొండల్లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
‘లక్ష్మీస్‌ వీరగ్రంధం' సినిమాపై అవసరమైతే ఓపెన్‌ బ్యాలెట్‌ పెట్టడానికి తాను సిద్ధమని, అందులో 10 శాతం మంది ప్రజలు లక్ష్మీ పార్వతి దేవత అని చెప్పినా సినిమా ఆపి ఆమె పాదాలకు వందనం చేస్తానని కేతిరెడ్డి తెలిపారు.

Recommended