• 8 years ago
Chandrababunaidu 's Ap chiefminister Chandrababunaidu discussed about Ysrcp assembly boycott in Tdp coordintaion committe meeting held at Amaravati on Wednesday.
అసెంబ్లీ సమావేశాలను ప్రజా సమస్యలపై చర్చకు వేదికగా వినియోగించుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం స్పీకర్ పరిధిలో ఉంది. దీనిపై నిర్ణయం తీసుకోకముందే కోర్టులకు వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ అంశాన్ని సాకుగా చూపి శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని భావించడం సరికాదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. .టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో వైసీపీ తీరును చంద్రబాబునాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి సమన్వయకమిటీ సమావేశం బుదవారం నాడు అమరావతిలో జరిగింది.
ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.అసెంబ్లీ సమావేశాలు, వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ అంశాలపై టిడిపి చర్చించింది. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించాలని నిర్ణయంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు.

Category

🗞
News

Recommended