Just One Song In Rajinikanth's "2.0" రోబో 2.0 లో పాటల సంగతేంటో

  • 7 years ago
Dubai caught in Robo fever. All eyes are sent on Dubai today -- the city will witness the highly awaited 2.0 music launch, starring Rajinikanth and Akshay Kumar, in the evening. The film will see a bevy of stars including arch rival Kamal Haasan, who will grace the occasion as its chief guest. The function will be hosted by Baahubali star Rana Daggubati.
శంకర్ సినిమాల్లో పాటలకుండే ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంత సీరియస్ సబ్జెక్టుతో సినిమా తీసినా.. అందులో పాటలకు వుండే ప్రయారిటీ వేరు..చాలా భారీగా పాటలు తీయడం ఆయనకు అలవాటు. ఒక మీడియం రేంజి సినిమాకు అయ్యేంత ఖర్చు పాటలకే పెట్టిస్తుంటాడు శంకర్. పాటలంటే ఆయనకు అంత ఇష్టం మరి. ‘రోబో’ లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలోనూ ఎంత బాగా పాటల్ని పొందుపరిచాడో తెలిసిందే. కానీ దీని సీక్వెల్ కాని సీక్వెల్ ‘2.0’లో మాత్రం ఒక్కటంటే ఒక్క పాటే ఉంటుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమానే స్వయంగా చెప్పాడు.
‘2.0’ కోసం తాను మూడు పాటల్ని స్వరపరిచారట. కానీ సినిమాలో ఉండేది మాత్రం ఒకటే పాట అంటున్నారు. మిగతా రెండు పాటలో అంటే.. ఆ పాటల్ని తాను ‘2.0’ ఆడియో వేడుకలో లైవ్ పెర్ఫామ్ చేస్తానని చెప్పాడు. మరి శంకర్ సినిమా అంటే భారీతనంతో కూడిన పాటలు ఆశించి వచ్చే అభిమానులకు ఒక్క పాటే ఉండటం అంటే చాలా కష్టంగా వుంటుంది కదా...? ఐతే ఎన్నడూ లేనిది ‘2.0’కు మాత్రమే శంకర్ ఇలా చేస్తున్నాడంటే.. అందుకు కారణం లేకుండా వుండదేమో.. సినిమాలో అంత ఇంటెన్సిటీ ఉండి ఉండొచ్చు. మే బి పాటలు స్పీడ్ బ్రేకర్లు అవుతాయని అనిపించి ఎందుకులే అనుకున్నారేమో.. మరి శంకర్ ఒక్క పాటతో ఎలా జస్టిఫై చేస్తాడో చూడాలి. ఆ వున్న ఒక్క పాటను ఎలా డిజైన్ చేసాడో చూడాలి.

Recommended