Bandra Railway Station Fire Under Control : Video | Oneindia Telugu

  • 7 years ago
The fire broke out near the east side of Bandra local station during a demolition drive carried out by the municipal corporation, the official said.16 fire stations have been rushed to the spot and 17 fire tankers are trying to fight the blaze.The fire broke out in Behrampada slum, near the Bandra station.
ముంబైలోని బాంద్రా సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాంద్రా రైల్వే స్టేషన్‌ తూర్పు భాగంలోని ఏరియాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఎగిసి పడిన మంటల కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. బృహత్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. . రైల్వే స్టేషన్‌కు చెందిన ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి. ఐతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు గుర్తించారు.
కాగా వెంటనే అప్రమత్తమైన అధికారులు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఇంజిన్లు, వాటర్ ట్యాంకర్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈరోజు గడిస్తే ఆస్తి నష్టంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Recommended