Nagpur Mumbai Duronto Express derails : Video

  • 7 years ago
The Nagpur Mumbai Duronto Express has derailed near Titwala. The incident at Maharashtra took place on the wee hours of Tuesday. The incident took place near the Kasara Ghat section.

రైల్వేలో వరుస ప్రమాద ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా మరో రైలు పట్టాలు తప్పడంతో.. రైల్వే భద్రతపై ఆందోళన పెరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున నాగ్‌పూర్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని తిత్వాల స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద ఘటనలో మొత్తం 7భోగీలు పట్టాలు తప్పగా.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్దిమందికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు పట్టాల పైకి బురద, రాళ్లు వచ్చి చేరడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.